ఎస్ఎఫ్ఐ ఆందోళన ఉద్రిక్తం.. భారీ కేడ్లు బద్దలు కొట్టి కలెక్టరేట్లోకి చోచ్చుకు వెళ్లిన నాయకులు.
అడ్డుకున్న పోలీసులు. వైన్స్ ల తెలంగాణ కాదు విజ్ఞాన తెలంగాణ కావాలి.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగారపు రజనీకాంత్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 21. (జనంసాక్షి). విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బారికేట్లను బద్దలు కొట్టి ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై పాదయాత్ర ద్వారా గుర్తించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ను కలిసి సమస్యలు వివరిస్తామని విద్యార్థి నాయకులు పట్టు పట్టారు. ఈ క్రమంలో నాయకులకు పోలీసులకు మధ్య భాగ్యవాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.నాయకులు పోలీసుల భారీ కేట్లను బద్దలు కొట్టి కలెక్టరేట్లోకి చోచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగారపు రజనీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని కావాల్సింది విజ్ఞాన తెలంగాణ కానీ వైన్స్ ల తెలంగాణ కాదని మండిపడ్డారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్ బకాయిలు 5177 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు పాదయాత్ర ద్వారా గుర్తించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలని అన్నారు. నాయకుల బృందం కలెక్టర్ ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి మల్లారం ప్రశాంత్, కుర్ర రాకేష్,వేణు ,సాయి, ఆదిత్య, అభిషేక్ ,నవీన్ ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.