ఎస్ఎఫ్ఐ నాయకులు అరెస్టుపై ఆగ్రహం.

కేంద్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థి నాయకులు నిరసన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 2.(జనంసాక్షి). నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో నిరసన తెలిపిన నాయకులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ కార్యదర్శి మల్లారం ప్రశాంత్ మాట్లాడుతూ తక్షణం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన జాతీయ విద్యా విధానం2020 బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో నిరసన తెలిపిన విద్యార్థి నాయకుల పై కేంద్రం అనుసరించిన దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండించారు. నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాకేష్ ,సాయి చరణ్, ఆదిత్య, శశి, మధు, వేణు ప్రవీణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు