*ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.*

*విద్య కార్పోరేటికరణ ప్రైవేటీకరణను వ్యతిరేకించండి*
 *ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుర్రు అనిల్ వనం రాజు*
 రామన్నపేట సెప్టెంబర్ 1 (జనంసాక్షి) విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బుర్రు అనిల్ కుమార్,వనం రాజు పిలుపునిచ్చారు. రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ నాలుగవ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర నాలుగువ మహాసభలు 2022 సెప్టెంబర్ 14,15,16 తేదీలలో  ఉద్యమాల పురటిగడ్డ అయిన కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చించబోతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే పరిస్థితిని పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి విద్యారంగాన్ని పూర్తిగా   నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రతిఏటా కోతలు వేస్తూ విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని అన్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా సకాలంలో స్కాలర్షిప్లు,రియంబర్స్మెంట్లు, రావడంలేదని అన్నారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కేవలం నెలకు 1500 మెస్ కాస్మోటింగ్ చార్జీలు రావడం  జరుగుతుంది, దీనివలన విద్యార్థులకు  ఏ విధంగా పౌష్టిక  ఆహారం అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి నెలకి 3000 రూపాయల మెస్  కాస్మోటింగ్ చార్జీలు పెంచాలని అదేవిధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మహాసభను విద్యార్థులు మేధావులు ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల మండల కార్యదర్శి బండ్ల పవన్ , బత్తిని అశ్విని,షాలిని,ప్రియ దర్శిని,సురేష్,మహేష్,నరేష్, తదితరులు పాల్గొన్నారు.