ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి.

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 1(జనం సాక్షి)
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నాలుగో రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ గురువారం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర 4వ మహాసభలు 2022 సెప్టెంబర్ 14,15,16 తేదీలలో మొదటిసారిగా ఉద్యమాల పురటిగడ్డ అయిన కరీంనగర్ జిల్లాలో నిర్వహించబోతున్నాం దీనిని జయప్రదం చేయాల్సిందిగా విద్యార్థులను, మేధావులను పిలుపునివ్వడం జరిగింది. ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చాలా సుదీర్ఘంగా చర్చించబోతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రతిఏటా కోతలు వేస్తూ విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని అన్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా సకాలంలో స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు రావడంలేదని అన్నారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కేవలం నెలకు 1500 మెస్ కాస్మోటింగ్ చార్జీలు రావడం జరుగుతుంది, దీనివలన విద్యార్థులకు ఏ విధంగా పౌష్టిక ఆహారం అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహాసభ సందర్భంగా ప్రతి విద్యార్థికి నెలకి 3000 రూపాయల మెస్ కాస్మోటింగ్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేయబోతున్నామని అన్నారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజులు నియంత్రణ చట్టం తీసుకొచ్చేంత వరకు పోరాటాలకు సన్నద్ధమయిదామని అన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా విద్యార్థులు మేధావులు ప్రతి ఒక్కరు ఆర్థిక హార్దిక సహకారాలు అందించి జయప్రద మీ వంతు కృషి చేయాలని కోరుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్, ఉపాధ్యక్షులు సాయి తేజ, నాయకులు రాకేష్ శ్యామ్ గణేష్ సాయికిరణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.