ఎస్ఎఫ్ఐ 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని బేలున్స్ ప్రదర్శన
ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ
కరీంనగర్ టౌన్ ఆగస్టు 16(జనం సాక్షి):
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో జరగబోయే నాలుగవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని బెలూన్స్ ని ఎగరేస్తూ ప్రదర్శన చేయడం జరిగింది .
ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ మహా సభల సందర్భంగా తెలంగాణ చౌక్ వద్ద బెలూన్ లను గాలిలొ ఎగరేస్తూ మహాసభలను విజయవంతం చేయాలని కార్యక్రమం చేయడం జరిగింది ఉద్యమాల పురిటిగడ్డ అయినా కరీంనగర్ లో జరగబోయే ఎస్ఎఫ్ఐ నాలుగవ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 14,15,16 తేదీలలో కరీంనగర్ వేదిక కానుంది కావున రాష్ట్ర మహాసభలు ప్రత్యేక వేడుకగా జిల్లాలో నిర్వహించబోతున్నామని దీనికి రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారని మరియు రాష్ట్ర కేంద్ర నాయకులు జాతీయ నాయకులు ప్రత్యేక అతిథులుగా ఈ మహాసభలకు హాజరవుతారని వారు తెలిపారు ఉద్యమాలు పురుడు పోసుకున్న కరీంనగర్ జిల్లాలో జరగడం చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు ఈ మహాసభలలో రాష్ట్రవ్యాప్త విద్యారంగ సమస్యలపై చర్చించి సమరశీల పోరాటాలకు విద్యార్థి లోకం సన్నదం కానున్నారు, అనేక సమస్యలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న వాటిపైన చర్చలు జరుగుతాయని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టే విధంగా మరియు విద్య కాషాయకరణ , దేశంలో మతోన్మాదం సృష్టిస్తున్న అలజడులలో అనేకమంది బలిఅవుతునారు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ మహాసభలలో చర్చలు జరగబోతున్నాయి, విద్యార్థుల కోసం విద్యార్థుల సమస్యల పైన నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం అవడం కోసం ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని వారు కోరారు కావున మొదటి రోజు భారీ బహిరంగ సభ తో మొదలై మూడు రోజులపాటు జరిగే ఈ మహాసభలను విద్యార్థిని ,విద్యార్థులు, మేధావులు, ప్రతి ఒక్కరూ విజయవంతం కోసం కృషి చేయాలని నాయకులు కోరారు
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాక్కపెల్లి,జిల్లా అధ్యక్షులు గజ్జెల శ్రీకాంత్ , నగర అధ్యక్ష కార్యదర్శులు తిప్పరపు రోహిత్ ,కాంపల్లి అరవింద్ నగర ఉపాధ్యక్షులు రత్నం సురేష్, వినయ్ సాగర్ సహాయ కార్యదర్శులు ఉప్పునుటి మనోజ్ , ప్రవీణ్ ,అరవింద్ ,దీలిప్ ,అరుణ్ ,సాయి కృష్ణ,
నాయకురాలు రమ్య,శ్రీవాణి,తదితరులు పాల్గొన్నారు ..*