ఎస్టీలతో సమానంగా హక్కులు కల్పించండి
ఆదిలాబాద్, జనవరి 1 (): గిరిజన ప్రాంతాలలో నివశిస్తున్న ఎస్సీలకు గిరిజనులతో సమానంగా హక్కులు కల్పించాలని వివిధ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం ఆదిలాబాద్‌లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. గిరిజన ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీలు భూములు సాగుచేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో నివశిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు వేరు వేరుగా చట్టాలు అమలు చేయడంవల్ల తీరని అన్యాయం జరగుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివశిస్తున్న ఎస్టీలతో సమానంగా హక్కులు కల్పిస్తే తప్ప వారి జీవన ప్రమాణాలు మెరుగుపడవని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఎస్టీ, ఎస్సీ ఉపప్రణాళిక మేరకు గిరిజన ప్రాంతంలోని ఎస్సీలను ఎస్టీలతోపాటు సమానంగా అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో దళితనాయకులు రవికాంత్, నాగవరావు తదితరులు పాల్గొన్నారు.