ఎస్సి లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
జహీరాబాద్ అక్టోబర్ 1 (జనంసాక్షి ) తెలంగాణ లో ఎస్సి లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అని మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎస్సి లు 20, % ఉన్నారన్న కేసీఆర్ ఎస్సిలకు కుడ విద్య మరియు ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని. అన్నారు. ఎస్సి వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకొనే అధికారం ఉన్నదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాబట్టి, కేసీఆర్ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. గనుక ఈరెండు సమస్యలను పరిష్కరించి ఎస్సి లకు న్యాయం చేయాలని కోరుతున్నాము అన్నారు.దేశ రాజాకియాలలోకి వెళుతున్న కేసీఆర్ మనరాష్ట్రంలో వున్న ఎస్సి ల సమస్యలు తీర్చి వేస్తే వేరే రాష్ట్రాలలో వున్న ఎస్సి లకు కూడా కేసీఆర్ ను నమ్మి వెంట్ట నడవడానికి సిద్ధపడే అవకాశం ఉంటది అన్నారు .మనరాష్ట్రంలో వున్న ఎస్సి ల సమస్యలు తీర్చాలని కోరారు.