ఎస్సీ,ఎస్సీ సబ్‌ప్లాన్ పై 23,24న అఖిలపక్ష భేటీ
హైదరాబాద్: ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అభిప్రాయాలను సేకరించేందుకు జూబ్లీహాల్‌లో కేబినేట్ సబ్ కమిటీ భేటీ అయింది. భేటీ ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం దామోదర నర్సింహ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ పై 23,24 తేదీల్లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని తెలిపారు. సబ్‌ప్లాన్ నిధుల సక్రమ అమలు పై ఈ నెల 30 లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. సబ్‌ప్లాన్ నిధులకు చట్టబద్దత కల్పించాలని కమిటీ అభిప్రాయపడిందని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీనిధుల ఖర్చుకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని ఆయనడిమాండ్ చేశారు.