ఎస్సీలపై జరుగుతున్న అరాచకాలు
చెన్నై : ఎస్సీలపై జరుగుతున్న అరాచకాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం జరుపనున్నామని జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్ కేజీ బాలకృష్ణన్ తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు జస్టిస్ బీసీ పటేల్, సత్యబ్రాతపాల్‌లు చేపట్టిన ఈ విచారణలను బాలకృష్ణన్ లాంఛనంగా ప్రారంభించారు. ఎస్సీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలు గుప్తంగా గ్రామాల వరకే పరిమితమవుతున్నాయని, ఈ నేపథ్యంలో నేరుగా వారి నుంచి వివరాలు సేకరించే లక్ష్యంతో చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. జాతీయ మానవ హక్కుల సంఘం సిఫార్సులను 99 శాతం మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం కార్యరూపంలో పెడుతున్నందుకు బాలకృష్ణన్ సంతోషం వ్యక్తం చేశారు.