ఎస్సీ కాలనీలో దండెత్తిన గొంగలి పురుగులు
రామాయంపేట, మెదక్: మండలంలోని కోనాపూర్ ఎస్సీ కాలనీపై గొంగలి పురుగులు దండెత్తాయి. సమీపంలోని పొలాల నుంచి పెద్దసంఖ్యలో గొంగలిపురుగులు ఇళ్లలోకి రావడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై వ్యవసాయశాఖ అధికారులకు సమాచారమందించినట్లు గ్రామస్థులు తెలిపారు.