ఎస్సీ బాలుర వసతిగృహం పరిశీలన

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): కూసుమంచిలో నిరుపయోగంగా ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ భవనాన్ని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ బాబురావు మంగళవారం పరిశీలించారు. వసతిగృహం విద్యార్థులను ఈ ఏడాది సవిూకృత వసతిగృహానికి తరలించిన నేపథ్యంలో విశాలమైన ఈ భవనం నిరుపయోగంగా మారింది. ఈ భవనాన్ని రెవెన్యూశాఖ శిక్షణ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని జిల్లా అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో ఏజేసీ తనిఖీ చేసి సౌకర్యాలను గుర్తించారు. ఏజేసీ వెంట డిప్యూటి తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఇదిలావుంటే  పోలీసులమని చెప్పి వాహనాలు తనిఖీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధిర సీఐ నూనె వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్‌/-టసేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరాలను అదుపుచేయటంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో నగదు డ్రా చేసేవారు మరో వ్యక్తిని తోడుగా ఉంచుకోవాలని సూచించారు.