ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించండి

` ప్రధాని మోదీ చొరవ చూపాలి
` అమలుకు అన్ని రాష్ట్రాలూ త్వరగా ముందుకురావాలి
` ఇప్పటికే నాలుగు రాష్ట్రాల సీఎంలు ముందుకొచ్చారు
` రిజర్వేషన్లు అన్ని కుటుంబాలకు అందుబాటులోకి రావాలి
` ఢల్లీిలో మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ
న్యూఢల్లీి(జనంసాక్షి):ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్టాల్రు త్వరగా ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హావిూ ఇచ్చారని చెప్పారు. దిల్లీలో మందకృష్ణ విూడియాతో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకారంలో మోదీ, అమిత్‌షా పాత్ర ఎంతో ఉంది. ప్రధాని, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్టాల్రు త్వరగా ముందుకు రావాలి. వర్గీకరణ డిమాండ్‌ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలి. వెంటనే అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని మోదీకి విజ్ఞప్తి చేశా. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి జడ్జికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదు. వర్గీకరణకు మద్దతుగా నిలిచిన ప్రతి నాయకుడికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఎస్సీ వర్గీకరణను దక్షిణాదిలో నలుగురు సీఎంలు వెంటనే స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు ముందుగానే స్పందించి స్వాగతిస్తున్నట్లు చెప్పారని మందకృష్ణ మాదిగ అన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం జరిగిన టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశంలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని సంతోషం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి ధన్యవాదాలు తెలుపుతామన్నారు. విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా కలిసి ధన్యవాదాలు చెబుతామని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. కాగా మందకృష్ణ మాదిగ శుక్రవారం రాత్రి ఢల్లీిలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారిని కలిసారు. . దాదాపు 30 నిమిషాలపాటు ప్రధానితో భేటీ అయిన మందకృష్ణ ఎస్సీ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, మంద కృష్ణను ఆప్యాయంగా పలకరించి హత్తుకున్న ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ. తెలుగు రాష్టాల్లో వర్గీకరణ త్వరితగతిన అమలు అయ్యేలా చూడాలని కోరారు. వర్గీకరణ అంశంపై కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుగ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.