ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ సడక్ బంద్

హత్నూర (జనం సాక్షి)
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించడంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు శనివారం హత్నూర మండలంలో సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు.దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నర్సాపూర్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జాప్యంతో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని వారన్నారు.ఇప్పటికే సామాజికంగా,ఆర్థికంగా  వెనుకబడిపోయిన మాదిగలు,మాదిగ ఉపకులాల ప్రజలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అందుకోలేక,ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లి మరింత పేదరికంలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్సీ వర్గీకరణకై యేళ్ళ తరబడి పోరాటం చేస్తున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవడం బాధాకరమన్నారు.ఇప్పటికైనా మోడీ సర్కారు ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతపై నిర్లక్ష్య వైఖరిని విడనాడి ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ గందగల్ల వీరయ్య,సీనియర్ నాయకులు గందగల్ల ప్రసాద్,కో కన్వీనర్లు డప్పు నవీన్,సత్యం,దుర్గయ్య,యువసేన ప్రధాన కార్యదర్శి సాయిలు,సురేష్,నర్సింలు,శివయ్య యాదగిరి,రాజు,విష్ణు,మల్లేశం,సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.