ఎస్సీ వర్గీకరణ తోనే విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయాల్లో సమాన అవకాశాలు..

ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలి.
బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూర్ బుగ్గప్ప మల్కయ్య.
తాండూరు జులై30(జనంసాక్షి)ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణమాదిగ పిలుపు మేరకు ఏంఎస్ఎఫ్ వికారాబాద్ జిల్లా కన్వీనర్  మల్లికార్జున్ మాదిగ అద్వరంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే  ఆమోదించాలని మరియు జూలై 3న హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్థలపై జరిగిన దాడిని ఖండిస్తు చేస్తున్న నిరసనకు తాండూర్ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద చేస్తున్న దీక్ష 5వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన దీక్షకు బీసీ సంఘం తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు బుగ్గప్ప కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య
సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా
బీసీ కన్వీనర్ రాజకుమార్ మాట్లాడుతు మందకృష్ణమాదిగ గత 28 సం రాలుగా అన్ని వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసాడని ఆయన పోరాట ఫలితమే 2008లో ఆరోగ్య శ్రీ పథకం సహకారం అయ్యిందని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితేనే ఎస్సీ లోని 58ఉప కులాలకు అన్నీ రంగాల్లో విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు హక్కులు కలుగుతాయి కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తోనే ఎస్సీ వర్గీకరణ & చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు బిల్లు పెట్టకుండా జాప్యం చేస్తోందని ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అన్నీ రకాలుగా అండగా బీసీ సంఘం వుంటుందనీ విద్యార్థి నాయకుడు మల్లికార్జున్ చేస్తున్న పోరాటానికి మా తరపున అన్నీ వేళలా అండగా ఉంటాం అని అన్నారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మల్కయ్య రైతు కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని దీక్షకు పూర్తిగా మద్దతు ఉంటుందని రాబోయే రోజుల్లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఎలాంటి కార్యక్రమం చేపట్టిన తమ వంతు బాధ్యతగా భవిష్యత్తుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కొరకు చేపట్టి ఏ కార్యక్రమానికైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎస్సీ వర్గీకరణ బిల్లుని వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని లేనిచో అన్ని రాజకీయ ప్రజాసంఘాల పక్షాన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ దీక్షలో తాండూరు పట్టణ బీసీ యువజన సంఘం అధ్యక్షులు బోయ నరేష్, తాండూర్ మండల బీసీ యువజన సంఘం అధ్యక్షులు బసంత్ కుమార్, బీసీ నాయకులు చంద్రశేఖర్, రమేష్ టైలర్ ,ఏంఎస్ఎఫ్ పెద్దేముల్ మండల ఇంఛార్జి స్వామిదాస్ మాదిగ, ఎంఎస్ఎఫ్ బషీరాబాద్ మండల ఇంఛార్జి జి.ప్రవీణ్ మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు శివాజీ రావణ్ మహేందర్ రాఖేష్ నాని గజేంద్ర రవిచెంద్ర గోపాల్ రమేష్ శ్రీను తదితరులు దీక్షలో పాల్గొన్నారు.