*ఎస్సీ వర్గీకరణ పై మోడీ స్పష్టహమైన వైఖరి ప్రకటించాలి*

*జాతీయ రహదారిపై భద్రతను పర్యవేక్షించిన ఎస్పీ వెంకటేశ్వర్లు*

జనం సాక్షి జడ్చర్ల :ఎస్సీ వర్గీకరణ పై భారతీయ జనతా పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వర్గీకరణ పై చర్చించాలని జాతీయ రహదారిపై నిరసనకు దిగారు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన. చేపట్టారు.
జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ పై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ.. వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో వెంటనే ఆమోదించాలంటూ.. మోడీ డౌన్ డౌన్ అంటూ రోడ్డు పైకి వచ్చి వాహనాలను అడ్డుకొని రాస్తారోకోకు దిగారు. పోలీసులు నిన్న రాత్రి ముందస్తుగా ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్టులు చేసిన పోలీసుల కండ్లు కప్పి కొంతమంది కార్యకర్తలు ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న రాజపూర్ మండల పోలీసులు ఆందోళన చేపడుతున్న ముదిరెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే ఆందోళనకారులు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు
*ఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణ*
హైదరాబాద్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిరసనగా ఎమ్మార్పీఎస్ జాతీయ రహదారుల దిబ్బందానికి పిలుపునివ్వడంతో జాతీయ రహదారిపై కటగీటమైన భద్రతను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజపూర్ మండలం ముదిరెడ్డిపల్లి వద్ద ఎంఆర్పిఎస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళన చెప్పటానికి విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ ఎస్పీఆర్ వెంకటేశ్వర్లు జాతీయ రహదారిపై భద్రతను పర్యవేక్షించారు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ అలెర్ట్ గా ఉండాలని పోలీసులకు సూచించారు