ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల అమలులో తాత్సారం?
భూ పంపిణీ కోసం దళిత లబ్దిదారుల ఎదురుచూపు
ఆదిలాబాద్,మే15(జనంసాక్షి): వ్యవసాయ పరంగా ప్రోత్సహించేందుకు బ్యాంకులతో సంబంధం లేకుండా దళితబస్తీ కింద దళిత కుటుంబాల్లోని మహిళల పేరున వ్యవసాయ భూముల పంపిణీ కోసం కసరత్తు ఒక్కోక్క దళిత కుటుంబానికి మూడు ఎకరాల వంతున భూ పంపిణీ చేయాలి. త్వరలో భూ పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.మళ్లీ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు భూ పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అప్పటివరకు జిల్లాలో ఏ మేరకు పంపిణీ చేస్తారో త్వరలోనే అధికారులు చర్యలు తీసుకుంటారు. జిల్లాలో భూములు విక్రయించేందుకు ఆసక్తిగా ముందుకు వచ్చే రైతుల కోసం చూస్తున్నామని ఎస్సీ సంక్షేమశాఖ అధికారుల వెల్లడించారు. ఈ పథకం ద్వారా భూమిని పొందిన లబ్దిదారు భూ అభివృద్ధితో పాటు ఏడాదికి కావాల్సిన పంట ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇకపోతే స్వయం ఉపాధికి రుణాలు..వ్యవసాయ ప్రోత్సాహానికి దళిత బస్తీ..విద్యాభివృద్ధికి ఉపకార వేతనాలు..ఇలా ఎస్సీ అభివృద్ది శాఖ దళితలు అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తోంది. స్వయం ఉపాధి రుణాల్లో పెద్ద యూనిట్ల విషయంలో చాలా మంది కిరాణం, జనరల్‌స్టోర్ వంటి దుకాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో ఎక్కువ మందికి రుణాలు ఇచ్చి..వాటిలో కార్లు,
వాహనాల పథకం కింద ఎక్కువ మందికి లబ్ది చేకూర్చాలన్న ఆలోచనతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో నిరుద్యోగ యువత ఉపాధికి మరింత ముందడుగుపడనుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పథకాలు, ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ జనాభాకు అనుగుణంగా వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి పలు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, విదేశీ విద్య సౌకర్యం, నైపుణ్యం శిక్షణ, దళిత బస్తీలో భూ పంపిణీ, కులాంతర వివాహ ప్రోత్సాహకాలు ఇలా.. అనేక సంక్షేమ పథకాలతో దళితుల విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఇది వరకు ఉమ్మడి జిల్లా సమయంలో దూరంతో పాలన పరంగా అధికారులు, ప్రభుత్వ సేవల పరంగా ప్రజలు కొంత
ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం చిన్న జిల్లాలు ఏర్పాటు కావడం..జిల్లా పాలన ప్రజలవద్దకు చేరడంతో అభివృద్ధికి మరింత దగ్గరదారి ఏర్పడింది. స్వయం ఉపాధి రుణాలను మూడు విభాగాల్లో మంజూరు చేస్తున్నారు.మూడో కెటగిరి రుణాల్లో వాహనాలు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. వీరే కాకుండా తోలు పనిచేసే కార్మికులు, అట్రాసిటి కేసు బాధితులు, జనజీవనంలో కలసిన వారికి, జోగినులు, సఫాయి కర్మచారులు..తదితర వర్గాలకు వివిధ యూనిట్లు మంజూరయ్యాయి. ఇవే కాకుండా విద్యుత్ వసతులు, పావలావడ్డి, శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక నిధులు కేటాయించింది. స్వయం ఉపాధి రుణాల్లో ఇదివరకు చాలా మంది దుకాణాలవైపు మొగ్గు చూపేవారు. కానీ ఈసారి కార్లు, నాలుగుచక్రాల వాహనాల పథకం కింద ఎక్కువమందికి లబ్దిచేకూరేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది.