ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు స్వెటర్స్ (చలికొట్లు)పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ *వనపర్తి టౌన్ :
నవంబర్ 7 (జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలోని జంగిటి పురంలో గల ఎస్సీ ఏ మరియు బీ హాస్టల్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మంజూరైన చెలికోట్లను వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎస్సీ ఏ హాస్టల్ 50 మంది విద్యార్థులకు ఎస్సీబీ హాస్టల్ 33 మంది విద్యార్థులకు చలికోట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ ఏ , బీ హాస్టల్ సందర్శించి అక్కడ పరిసరాల పరిశుభ్రత పట్ల ఆరాధిసి విద్యార్థుల భోజన వసతి తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులను మంచి వసతులు కల్పించాలని సదుద్దేశంతో సన్నబియ్యంతో మొదలైనటువంటి అనేక సంక్షేమ పథకాలు విద్యార్థిలకు అందజేయడం జరిగిందని అందులో భాగంగా నాణ్యమైనటువంటి కాస్మాటిక్స్ డైనింగ్ హాల్స్ దోమల, పందుల బెడద లేకుండా తగు జాగ్రత్తలు పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు విద్యార్థి ఇలా బాగోగులను చూసుకుంటుందని, తెలియజేశారు విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని తద్వారా ప్రభుత్వం కాంక్షించే విజయాలను మీరు సాధించాలని కోరారు విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ పాఠశాలలను మౌలిక వసతుల కోసం ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ దే అని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్, వంటగదిల, పాఠశాల గదులు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణంపై అదే విధంగా ,క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న కేసీఆర్ కి మంత్రి నిరంజన్ రెడ్డికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో భారత్ కుమార్, యాదవ్ ఎస్సీ ఏబీ హాస్టల్ వార్డెన్స్ రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.