ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర 4 వ మహాసభ లను విజయవంతం చేయండి
ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎండి సాదిక్.
దుబ్బాక ఆగష్టు 01,( జనం సాక్షి )
కరీంనగర్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 14 నుండి 16 వరకు జరిగే ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభ లను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎండి సాదిక్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రమైన దుబ్బాక పట్టణంలో ఎస్.ఆర్ కళాశాల ఆవరణలో కళాశాల విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాలుగవ మహాసభల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎండి సాదిక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సమస్యలను చిన్నచూపు గత రెండు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల కాక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. గురుకుల హాస్టల్ లో నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు గురవుతున్నారని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలను పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం దీనివల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతుందన్నారు. నూతన విద్యా విధానం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికై నిర్దిష్ట చర్చలు జరిపి తీర్మానాలు చేస్తామన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న 900 మంది విద్యార్థి నాయకులు ప్రతినిధులుగా, 100 మంది పరిశీలకులుగా పాల్గొంటున్నారు. వీరితోపాటు రాష్ట్ర, జాతీయ నేతలు ఇట్టి మహాసభలకు హాజరవుతున్నారు ప్రభుత్వ రంగ విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికై నిర్దిష్ట చర్చలు జరిపి తీర్మానాలు చేస్తామన్నారు. ప్రజాతంత్ర భావాలు పెంపొందించే విధంగా చర్చలు కొనసాగుతాయి అన్నారు కాబట్టి ఇట్టి మహాసభలను విజయవంతం చేయడానికి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్ , వినయ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.