ఏఐఎస్ఎఫ్ 3వ రాష్ట్ర మహాసభల గోడపత్రిక విడుదల

వనపర్తి ఆగస్టు 20 (జనం సాక్షి): వనపర్తి జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)3వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను శనివారం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ఈనెల 26,27,28 తేదీలలో కొత్తగూడెంలో అఖిలభారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను నిర్వహిస్తున్నామని ఈ మహాసభలను విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యల పరిష్కరిస్తామని,ఉచిత విద్యను అందిస్తామని, గొప్పలు చెప్పి గద్దెనెక్కి ఇచ్చిన హామీలను మరిచారన్నారు.ప్రభుత్వ యూనివర్సిటీలను మూసివేయాలనే కుట్రలో భాగంగా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా రంగంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర,లెక్చరర్ పోస్టులను భర్తీ చేయకుండా,మౌలిక సదుపాయాలను కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ వాటిని మూసివేయడానికి ప్రభుత్వాలు కుట్ర చేస్తూ. సంక్షేమ హాస్టల్ లో గురుకులాలు సమస్యలకు నిలయంగా మారిన ఈ ప్రభుత్వాలు పట్టించుకునే పాపాన పోలేదన్నారు.ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు సకాలంలో ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందన్నారు.ఈ ప్రభుత్వాలకు విద్యార్థులు తగిన గుణపాఠం చెప్తారన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వంశీ,విజయ్,ప్రకాష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.