ఏఐటీయుసీతోనే కార్మిక హక్కులు సాధ్యం
కొల్లాపూర్)* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఏఐటీయసీ వ్యతిరేకిస్తుందని, కార్మిక హక్కులను ఏఐటీయసితోనే సాధ్యమవుతుందని నాగర్ కర్నూల్ జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ అన్నారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ జిల్లా రెండో మహాసభ వాల్ పోస్టర్ ను ఏఐటీయూసీ,జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ జిల్లా మహిళా సమైక్య అధ్యక్షులు ఇంద్ర, సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమ్ము భరత్ మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదట ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920 సంవత్సరంలో ఆవిర్భవించిందని, కేంద్ర రాష్ట్రాలలో కార్మిక హక్కులు, చట్టాల కోసం ఐటియుసి అనేక పోరాటాలు చేసిందన్నారు. కొల్లాపూర్ పట్టణంలో నవంబర్ 1 ,2 తేదీలలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మహాసభలు ఉంటాయని ఈ సభలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమైక్య అధ్యక్షుడు ఇంద్ర ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు టి కిరణ్ కుమార్, కొల్లాపూర్ సిపిఐ పట్టణ కార్యదర్శి ఎండి యూసుఫ్, అమాలి యూనియన్ నాయకులు శివాజీ, అశోక్ ,చంద్రమౌళి, నరేష్, నిరంజన్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు,