ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలి. ఏఐటియుసి

వెంకటాపూర్(రామప్ప)అక్టోబర్31(జనం సాక్షి):-

సోమవారం రోజున వెంకటాపూర్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ జెండాను ఆవిష్కరించిన భవనిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు,జిల్లా కోశాధికారి కొక్కుల రాజేందర్ మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆవిర్భవించి నేటికీ 103 సంవత్సరాలు కావస్తుంది అన్నారు.ఇన్ని సంవత్సరాల చరిత్రలో అనేక పోరాటాలు నిర్వహించి అనేక చట్టాలను సాధించడం జరిగింది అన్నారు. అందులో భాగంగా భవన నిర్మాణం సంక్షేమ అపోర్టును ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించింది అన్నారు ఈ సందర్భంగా మరణాలు ఎలా సంభవించిన పది లక్షల పరిహారం అందించే విధంగా భవన నిర్మాణ కార్మికులు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సామల దేవెందర్,మద్దెల మురళి,సామల రాజు,సాద మహేందర్,బొమ్మెడి శేఖర్, మామిడి రాజయ్య,లోకుల వరుణ్,గుర్రాల లోకేష్, యాట అంజి,తోట రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు