ఏఐటీయూసీ నల్గొండ జిల్లా మహాసభను జయప్రదం చేయండి.

పల్లా దేవేందర్ రెడ్డి పిలుపు

నల్గొండ బ్యూరో. జనం సాక్షి. నవంబర్ 13వ తేదీన కొండమల్లేపల్లి లో జరిగే ఏఐటియుసి నల్లగొండ జిల్లా పదవ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం దేవరకొండలో జరిగిన హామాలి వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం ఏఐటియుసి నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు .కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను సమూలంగా మారుస్తూ పెట్టుబడిదారుల కొమ్ముకాస్తుందని దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. హమాలి కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించడంలో పాలకులు విఫలమైనారని ఆరోపించారు. హమాలి కార్మికులకు ప్రభుత్వ బీమా సౌకర్యం కల్పించాలని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానం తిప్పికొట్టేందుకు కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నయని దాని వల్ల కార్మికుల జీవితాలు దుర్బరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు హామాలి కార్మికులకు రక్షణ చట్టాలు కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 10వ తేదీ కొండమల్లే పెల్లి లో జరిగే జిల్లా పదో మహాసభలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి హమాలి యూనియన్ అధ్యక్షుడు నీలా వెంకటయ్య అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జూలూరు వెంకట్ రాములు మండల కార్యదర్శి అలమోని మల్లయ్య,హమాలీ యూనియన్ కార్యదర్శి గోదాసు కృష్ణయ్య, దోమల వెంకటయ్య ,పంగా శ్రీను ,మండే వెంకటయ్య, కడారి శ్రీను, రమేష్ అంజి తదితరులు పాల్గొన్నారు
 

తాజావార్తలు