ఏఐపై మోదీవి మాటల కోటలే..
` కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదు:రాహుల్
న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. డ్రోన్ టెక్నాలజీని వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈసందర్భంగా కొత్త సాంకేతికతను రూపొందించడానికి మనకు బలమైన పునాది కావాలని ఆయన పేర్కొన్నారు.’డ్రోన్‌లు యుద్ధరంగంలో విప్లవాత్మక మార్పులు చేశాయి. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టికల్‌లు జత చేయడంతో యుద్ధభూమిలో కమ్యూనికేట్ అవుతున్నాయి. అయితే, ఇది కేవలం ఒక సాంకేతికత కాదు. బలమైన పారిశ్రామిక వ్యవస్థతో ఉత్పత్తి చేసిన ఆవిష్కరణలు. దురదృష్టవశాత్తూ ప్రధాని మోదీ ఈ విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యారు. ఆయన ఏఐపై టెలీప్రాంప్టర్‌లో ప్రసంగాలు చేసుకుంటూ ఉంటే.. మన పోటీ దేశాలు మాత్రం కొత్త సాంకేతికతను సృష్టించి రాటుదేలుతున్నాయి. సాంకేతికతను రూపొందించడానికి మనకు ఒక బలమైన పునాది కావాలి. వట్టి మాటలు కాదు’ అని రాహుల్ విమర్శించారు.ఇక, డ్రోన్ ఉత్పత్తిలో చైనా పురోగతిని ఉదాహరణగా చూపుతూ.. భారత్‌కు స్పష్టమైన వ్యూహం అవసరమని రాహుల్ నొక్కి చెప్పారు. మన దేశంలో అపారమైన ప్రతిభ కలిగిన ఇంజినీరింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు దేశాన్ని ముందుకు నడిపేందుకు ధృఢమైన పారిశ్రామిక నైపుణ్యం అవసరమన్నారు.ఇదిలాఉండగా.. ఇటీవల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఏఐ యాక్షన్ సమ్మిట్ (ంఎ ూబీఎఎతిబి)కు అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి అధ్యక్షత వహించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ (ంఎ)తో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలను కొట్టిపారేశారు. టెక్నాలజీ వల్ల పని అదృశ్యం కాదని, అది తన రూపాన్ని మార్చుకుంటుందని, కొత్తతరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని చరిత్ర చెబుతోందన్నారు.