ఏఐసీసీ పర్యవేక్షకుల పరిశీలన
సంగారెడ్డి అర్బన్: వచ్చే ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచార సేకరణ కోసం శుక్రవారం ఏఐసీసీ పర్యవేక్షులు అమర్‌కాలే ఆధ్వర్యంలో స్థానిక ఐబీ కార్యాలయంలో పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధిత నియోజక వర్గాల అభ్యర్థులు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలతో అమర్‌కాలే చర్చిస్తున్నారు. పార్టీ బలోపేతానికి తోడ్పడే సరైన నాయకుడు ఎవరనే అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గీతారెడ్డి ,ఎంపీ సురేష్‌కుమార్, ప్రభుత్వ వివ్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.