ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలి

ప్రతినిధి (జనంసాక్షి): రైతుల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు.గురువారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ఎస్బిఐ ఏడీబి బ్రాంచ్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల రుణమాఫీని ఒకేసారి చేయాలని డిమాండ్ చేశారు.రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడులకు కొత్త రుణాలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు.రైతుబంధు డబ్బులను బ్యాంకు అధికారులు అప్పు కింద జమ చేసుకుంటున్నారని, వాటిని రైతులకు ఇవ్వాలన్నారు.పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బ్యాంక్ మేనేజర్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మందడి రాంరెడ్డి , రైతు సంఘం జిల్లా నాయకులు పందిరి సత్యనారాయణరెడ్డి, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, బోళ్ల నాగేందర్ రెడ్డి, నారాయణ వీరారెడ్డి, దండ శ్రీనివాస్ రెడ్డి ,చెట్లంకి యాదగిరి, నాగిరెడ్డి సత్యనారాయణరెడ్డి ,నాగిరెడ్డి గోపాల్ రెడ్డి, నాగిరెడ్డి నరసింహారెడ్డి , మెంతబోయిన లింగయ్య, జిల్లా ప్రజా సంఘాల నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు ,కొలిశెట్టి  యాదగిరిరావు, మట్టిపెళ్లి సైదులు, కోట గోపి ,చెరుకు ఏకలక్ష్మి ,ధనియాకుల శ్రీకాంత్, జిల్లపల్లి నరసింహారావు, వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు