ఏకాభిప్రాయంతోనే కామన్‌ సివిల్‌ కోడ్‌

1234568

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 14(జనంసాక్షి): అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సమాచారశాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకుని రావడమే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. శుక్రవారం దిల్లీలో ఆయన మాట్లాడుతూ… కామన్‌ సివిల్‌కోడ్‌ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదన్నారు.   ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వ్యాఖ్యలను  ఆయన తీవ్రంగా ఖండించారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే చట్టాని తీసుకోచ్చారని వివరించారు. తలాక్‌ చెప్పే వ్యవస్థ మంచిది కాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. సుప్రీం ఆదేవాలతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే మద్దతిచ్చే వారితో వెళ్లండి,  ప్రధానిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం మంచిది కాదన్నారు. తలాక్‌ చెప్పే వ్యవస్థను రూపుమాపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరగాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ముస్లింలలో తలాఖ్‌ వ్యవస్థ పోవాలని వెంకయ్య నాయుడు అన్నారు.ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వ్యాఖ్యలను ఆయన తప్పు పడుతూ దేశ ప్రజల ప్రయోజనాల కోసమే కామన్‌ సివిల్‌ కోడ్‌ చట్టం అని ఆయన అన్నారు. దీనిని తాము కొత్తగా తేవడం లేదని అన్నారు.తలాక్‌ వ్యవస్థ మంచిది కాదని సుప్రింకోర్టు చెప్పిందని ఆయన అన్నారు. అన్ని రంగాలలో మహిళలకు సమాన హక్కులు ఉండాలన్నది ప్రభుత్వ విధానమని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ప్రధానిని వ్యక్తిగతంగా విమర్శించడం తగదని ముస్లిం సంస్థల వారికి ఆయన చెప్పారు. తలాక్‌ వ్యవస్థను రూపుమాపవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.ఈ నిర్ణయంతో కేంద్రానికి , ముస్లిం సంస్థలకు మధ్య విభేదాలు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పౌర స్మృతి అంశంపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తీవ్రం గా స్పందిస్తోంది. త్రిపుల్‌ తలాఖ్‌ కు వ్యతిరేకంగా కేంద్రం తన అబిప్రాయాన్ని సుప్రింకోర్టుకు తెలిపిన సంగతి విదితమే. అదే సమయంలో యూనిఫాం సివిల్‌ కోడ్‌ విషయంలో కూడా భిన్నాబిప్రాయాలు ఏర్పడ్డాయి. ముస్లిం పర్సనల్‌లా జోలికి వస్తే సహించబోమని, అందులో ఒక్క అక్షరాన్ని కూడా మార్చబోమని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పష్టం చేసింది. ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు లా కమిషన్‌ రూపొందించిన ప్రశ్నావళిని దేశంలోని ముస్లింలంతా తిరస్కరించాలని బోర్డుతో పాటు ఇతర ముస్లిం సంస్థలు కూడా పిలుపు ఇచ్చాయి. ఆ ప్రశ్నావళిపై జరిగే ప్రజాభిప్రాయసేకరణలో ముస్లింలు ఎవ్వరూ పాల్గొన వద్దని కోరాయి. లా కమిషన్‌ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, బిజెపి ప్రభుత్వ ఎజెండాను అమలు చేసే సంస్థగా మారిందని ఆ సంస్థలు విమర్శించాయి.