ఏడాదిలో రాహుల్‌ కు అధ్యక్ష బాధ్యతలు

rahul-story_647_011016085832అత్యంత కీలకమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేకుం డానే సాగింది. అనారోగ్యం కారణంగా సోనియా గైర్హా జరు కావడంతో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ ముఖ్యనేత లంతా పాల్గొన్న ఈ భేటీలో ప్రస్తుతం దేశంలోని రాజ కీయ పరిస్థితులు, కాంగ్రెస్‌ తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చలు సాగాయి. వచ్చే సంవత్సరం యూపీ, పంజాబ్‌ సహా గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సం దర్భంగా పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలపైనా నేతలు చర్చించి నట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.  కాగా, రాహుల్‌ గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగి స్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రారంభంకావడం గమనార్హం. పార్టీలో సంస్థాగత ఎన్ని కలు ఈ డిసెంబర్‌ చివరికి పూర్తి కావాల్సివుండగా, వాటిని సైతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ వాయిదా వేయాలని కూడా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ప్రక్రియ మరో ఏడాది పాటు ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలను ఏడాది కాలం వాయిదా వేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.