ఏడుగురు కుటుంబసభ్యులను చంపి… ఆత్మహత్య

 హైదరాబాద్‌,జ‌నంసాక్షి: చెయనా నూతన సంవత్సరం ప్రారంభం కావడానికి రెండు రోజులే ఉన్న సమయంలో చెయనాలోని హెబై ప్రావిన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలు సహా ఏడుగురు కుటుంబసభ్యులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. హెబై ప్రావిన్స్‌లోని గ్జియ్ణాొం గ్రామంలో వ్యుషౌగువా అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్యను, ఆమె తల్లితండ్రులను, ఇద్దరు పిల్లలను, మరో ఇద్దరు దూరపు బంధువులను బలమైన వస్తువుతో కొట్టి చంపాడు. తర్వాత అతడు విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఈ ఘటన జరగగా పోలీసులు మంగళవారం వివరాలను వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన ప్రదేశంలో పోలీసులు వ్యు రాసిన సూయిసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.