ఏడుగురు రైతుల అరెస్టు
రేగొండ : మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన ఏడుగురు రైతులను నకిలీ పహానీల కేసులో ఆరెస్టు చేసినట్లు ఎస్పై కొమ్ముతిరుపతి తెలిపారు, గ్రామానికి చెందిన టి.సారంగపాణి ,ఎం .రాజయ్య ఎన్. శ్రీనివాస్, ఇ. కుమారస్వామి ,ఎన్. రాజయ్య. కెవెంకటయ్య.పి. సులోచనలు నకిలీ పహానీలతో సహకార సొసైటీలో రుణాలు పొందారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్త అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.