ఏడోరోజుకు చేరిన ముద్రగడ దీక్ష

వైద్యానికి నిరాకరణ..క్షీణిస్తోన్న ఆరోగ్యం
రాజమండ్రి,జూన్‌15(జ‌నంసాక్షి ) : తుని ఘటనలో అరెస్టులకు నిరసనగా మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం చేపట్టిన దీక్ష ఏడో రోజుకు చేరింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ఆయన బుధవారం ఉదయం కూడా రక్తపరీక్షలకు అంగీకరించలేదని వైద్యవిధాన పరిషత్‌ సమన్వయ అధికారి డాక్టర్‌ రమేశ్‌ కిషోర్‌ తెలిపారు. రెండు గంటలకోసారి బీపీ పరీక్షించడానికి ముద్రగడ అంగీకరించినట్లు వెల్లడించారు. బీపీ 130/80 ఉందని, సాయంత్రం లోపు కుటుంబ సభ్యుల సహకారంతో వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ముద్రగడ భార్య, కోడలికి వైద్యం అదిస్తున్నామని వైద్యులు తెలిపారు. వైద్యానికి అంగీకరించకుంటే పరినామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి  ముద్రగడ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని… వెంటనే వైద్యం అందించాలని వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. ఆయన మాత్రం వైద్యానికి అంగీకరించడం లేదని.. పరీక్షల కోసం రక్త నమూనా కూడా ఇవ్వడం లేదన్నారు. కుటుంబసభ్యులు, బంధువులు, తాము విజ్ఞప్తి

చేస్తున్నా ఆయన వైద్యానికి అంగీకరించడం లేదన్నారు. బలవంతంగా వైద్యం చేసే అంశంపై అధికారులకు నివేదించామన్నారు. ఆయన అనుమతి లేకుండా వైద్యం చేయడం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ముద్రగడ అనుమతిస్తే వైద్యం ప్రారంభిస్తామని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ రమేశ్‌ కిషోర్‌ చెప్పారు.

తాజావార్తలు