ఏదీ ఫీలయ్యారో అదే చెప్పారు

1

– మమత

కోల్‌కత్తా నవంబర్‌26(జనంసాక్షి):

బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌కు పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మద్దతిచ్చారు. దేశంలో అసహనం గురించి ఇటీవల ఆమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇది ప్రజాస్వామ్య దేశం.. అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆయన ఏం ఫీలయ్యారో అదే చెప్పారు.. ఆయనకు చెప్పే హక్కు ఉందని మమతా బెనర్జీ అన్నారు. దేశం వదిలి వెళ్లమనే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. దేశం అందరిదీ అని అన్నారు. ఆమీర్‌ఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేశంలో అసహనం కారణంగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో దేశం వదిలేసి వెళ్దామా అని తన భార్య తనను అడిగిందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగింది. భాజపా వర్గాలు వ్యాఖ్యలపై విమర్శలు చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు మద్దతిస్తున్నాయి.