ఏపీకి గ్యాస్‌ ఇవ్వాలంటే

మోడీ అనుమతి కావాలట !
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యా సింధియా వ్యాఖ్యన్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) :
గ్యాస్‌ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోను ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్‌ ఇవ్వలేమని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా స్పష్టం చేశారు. మంగళవారం నాడు అడ్వయిజరీ కమిటీతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ ఆంధ్ర రాష్ట్రానికి అదనపు గ్యాస్‌ ఇవ్వలే మన్నారు. గుజరాత్‌-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఉన్న గ్యాస్‌ ఒప్పందంలో కేంద్రం జోక్యం చేసుకోబోదన్నారు. గుజ రాత్‌ రాష్ట్రం ఒప్పుకుంటేనే ఆంద్ర óప్రదేశ్‌కు అదనపు గ్యాస్‌ ఇవ్వ గలమని తేల్చి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డి తనను కలిసి రాష్ట్రానికి అదనపు గ్యాస్‌ ఇవ్వాలని కోరారని సింధియా తెలిపారు. అయితే గ్యాస్‌ సమస్య అంతటా ఉందని, ఎవరికి వారు ప్రత్యామ్నాయాలు చూసు కోవాలని సూచించారు.