ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

4

– ప్రధానికి రాహుల్‌ లేఖ

న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హావిూని మోదీ నిలబెట్టుకోవాలని లేఖలో కోరారు. ప్రత్యేక ¬దా ఇస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందని కావున దీనిపై త్వరగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పేజీ లేఖలో రాహుల్‌ అనేక విషయాలను పేర్కొన్నారు. ఇటీవల తాను రెండుసార్లు ఏపీలో పర్యటించిన సందర్భంలో ఎన్నికల హావిూలు నెరవేర్చలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని లేఖలో తెలిపారు. విభజన సందర్భంగా ఇచ్చిన హావిూలను నెరవేర్చి ఏపీకి న్యాయం చేయాలన్నారు. ప్రత్యేక ¬దా వల్ల మిగిలిన రాష్ట్రాలతో కలిసి ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పారు. ఈనెల 22న జరిగే ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రత్యేక ¬దాపై ప్రకటన చేయాలని రాహుల్‌ లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రత్యేక ¬దాపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇటీవల పిసిసి చీఫ్‌ రఘువీరా రాహుల్‌ను కలిసి లేకరాయాలని కోరారు. ఈ మేరకు ఆయన తోణం లేఖ రాశారు. ఇదిలావుంటే  విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ యూపీఏ ప్రకటించిన అంశాలను కేంద్రం ప్రభుత్వం నెరవేరుస్తుందని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మూలానక్షత్రం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈనెల 22న ప్రత్యేక ¬దాపై ప్రధాని ప్రకటన  కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హావిూని నెరవేర్చి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలపాలన్నారు.