ఏపీకి హైకోర్టు వస్తే బాబుకు బాదేంటి?
– న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్న బాబుపై సుమోటోకేసు పెట్టాలి
– వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య
హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా హైకోర్టు ఏపీకి వచ్చిందని, దానికి సంతోషించాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధపడుతున్నాడని, అసలు ఆయన బాదేంమిటో అర్థం కావటం లేదని వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేవంలో మాట్లాడారు.. హైకోర్టు విభజన విషయంలో సుప్రీంకోర్టు తీర్పును, రాష్ట్రపతి ఉత్తర్వులను చంద్రబాబు వ్యతిరేకించడం ఏమిటని ప్రశ్నించారు. హైకోర్టు విభజన అయితే నడుస్తున్న కేసుల్లో న్యాయం ఏమైనా మారుతుందా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు బుర్రలోనే కుట్ర దాగిఉందని, మళ్లీ ఆయనే కుట్ర అనడం విడ్డూరంగా ఉందని నిప్పులుచెరిగారు. ‘ప్రత్యేక
ప్యాకేజీ వస్తే తన వాళ్లకి ఫండ్స్ పంచి పెట్టొచ్చు అని చంద్రబాబు చూశారని, పర్యావరణ అనుమతులు లేకున్నా ముఖ్యమంత్రి భవనంలో నివాసముంటున్నారు. ఏ సౌకర్యాలు లేకుండా అధికారులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. బాబు మాత్రం నది ఒడ్డున మంచి భవంతిలో బతుకుతున్నారన్నారు. ప్రభుత్వ విూటింగుల కోసం విజయవాడ ¬టల్స్‌లో కోట్లు ఖర్చు చేశారని, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్న చంద్రబాబుపై సుమోటోగా కేసు పెట్టాలన్నారు. న్యాయ వ్యవస్థలే కుట్ర పన్నుతున్నాయని బాబు అంటున్నారని, చట్టసభలను, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాబుపై సుమోటోగా కేసు వేసి విచారణ జరపాలన్నారు.
రాత్రికిరాత్రి బాబు సెక్రటేరియట్ తరలిస్తే తప్పు కాదు.. కానీ, కోర్టును తరలించాలంటే తప్పా అని ప్రశ్నించారు. ఏపీకి హైకోర్టు రావాలన్న పేపర్లు, వ్యక్తులు ఇప్పుడు మాట మార్చారని, బాబు తన కోసం వ్యవస్థలను వాడుకుంటున్నారని విమర్శించారు. కోర్టులు ఏపీకి వస్తే వైఎస్ జగన్ కేసులు మొదటికొస్తాయని అని బాబు అనడం దారుణమన్నారు. న్యాయ వ్యవస్థకే రాజకీయాలు అంటగడుతున్నారని, మనం డిమాండ్ చేసుకున్న కోర్టును, వారు ఇస్తే.. బాబు దీన్ని కుట్ర అంటారన్నారు.