ఏపీని బీజేపీ మోసం చేసింది : సీతారామ్ ఏచూరి
విజయవాడ, ఫిబ్రవరి 8 : తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలనే బీజేపీ లాభాలు పొందిందని సీపీఎం సీనియర్ నేత సీతారామ్ ఏచూరి అన్నారు. కానీ అంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదని, ఏపీని మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. భవిష్యత్‌లో కూడా ఇస్తుందన్న నమ్మకం కూడా లేదని ఆయన అన్నారు.
సీపీఎం 24వ రాష్ట్ర మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతారామ్ ఏచూరి ఆదివారం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఆ విధంగా అభివృద్ధి చేస్తే చాలా మంచిదని… నిజంగా అభివృద్ధి జరుగుతుందా? లేక అంతా భ్రమేనా అని ఆయన అన్నారు.