ఏపీపై మోదీకి ఎలాంటి వివక్ష లేదు
– ఏపీకి హోదా ఇస్తే.. మహారాష్ట్ర కూడా అడుగుతుంది
– తెదేపా రాజకీయ ప్రయోజనాలకోసమే ఎన్టీయే నుంచి బయటకెళ్లింది
– కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
విజయవాడ, మే30(జనం సాక్షి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రధానమంత్రి మోదీకి ఎలాంటి వివక్ష లేదని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అన్నారు. విజయవాడలో బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా అడుగుతాయన్నారు. అందుకే ప్రత్యేక హోదా కాకుండా.. దానితో సమానంగా ప్రయోజనాలు ఏపీకి దక్కేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని తెలిపారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినా.. ఎవరికీ ¬దా ఇవ్వలేదని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్టీయే కూటమి నుంచి బయటకు వెళ్లిపోయిందని కేంద్రమంత్రి విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హావిూని విస్మరిస్తారా? అని విూడియా నిలదీయగా.. ¬దా ఇవ్వకున్న ¬దా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కల్పిస్తామని జితేంద్ర సింగ్ సమాధానం చెప్పారు. ఆంధప్రదేశ్‌కు సాయం అందించే విషయంలో కేంద్రం ఏనాడు వెనకడుగు వేయలేదన్నారు. రూ.350 కోట్లు ఏపీ ఖాతాలో వేసి వెనక్కి తీసుకోవడంపై విూడియా నిలదీసింది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కేంద్ర కారణం కాదని.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని కేంద్రమంత్రి ఆరోపించారు. వినియోగ పత్రాలపై తెదేపా నేతలు మాట్లాడినప్పుడు అమిత్ షా సమాధానం చెబితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఏపీని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయదని, దశలవారీగా నిధులు ఇచ్చి ఏపీని అన్ని విధాలుగా ఆదుకొనేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఉన్నా.. లేకున్నా.. ఏపీకి ఏ విధంగా సాయం చేయాలో కేంద్రానికి తెలుసుని, ఖచ్చితంగా దశలవారీగా భాజపా ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తుందని స్పష్టం చేశారు.