ఏపీ ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకొనేందుకే..
కేంద్రంపై ఆరోపణలు
ా మాపై బురద జల్లితే వాళ్లకే అంటుకుంటుంది
ా అవినీతి అక్రమాల్లో ఏపీ ముందంజలో ఉంది
ా బీజేపీని తక్కువ అంచనా వేసిన పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి
ా ఏపీలో తెదేపాకు అదే పరిస్థితి ఎదురవుతుంది
ా ఎపీ ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి కాగితాల్లోనే కనిపిస్తోంది
ా ప్రజాధనాన్ని ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తున్నారు
ా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఎల్ నరసింహరావు
విజయవాడ,జూన్6(జనం సాక్షి): తెలుగుదేశం పార్టీ రాజకీయ మనుగడ కోసమే కేంద్రం, భాజపాలపై
ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే అది వారికే అంటుకుంటుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తమపై ఆరోపణలు మానుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో ఫోన్ సంభాషణలు వెలుగులోకి వస్తే తెదేపా నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. ఈ అంశాన్ని రాజకీయంగా తాము లేవనెత్తలేదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంబర్‌వన్‌గా ఉందని విమర్శించారు. చాలా రాష్ట్రాల్లో భాజపాను తక్కువగా అంచనా వేసిన పార్టీలు ఇప్పుడు తుడుచుపెట్టుకుపోయాయని.. ఆంధప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి వస్తుందన్నారు. తెదేపా నేతలు చేసే ఆరోపణలను తాము పట్టించుకోమని.. రాష్ట్రంలో తమ పార్టీ అభివృద్ధి పైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలోని వెనుకబడిన 7జిల్లాలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవడం లేదని జీవీఎల్ నరసింహరావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రచారం కోసం వినియోగిస్తూ దుర్వినియోగం చేస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి కాగితాల్లో తప్ప ఎక్కడా కనిపించడం లేదన్నారు. కృష్ణపట్నం కారిడార్ భూసేకరణ పూర్తిచేసి ఎన్సీపీకి అప్పగిస్తే నిధులొస్తాయని.. అంతేగానీ అబద్ధాలు చెబితే రావన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ పూర్తయితే 30లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని… కానీ పారిశ్రామిక కారిడార్ల గురించి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సరైన సమాచారం ఇవ్వట్లేదని ఆరోపించారు. బాబుతో జాబు రాలేదు కానీ….జబ్బులొచ్చాయని ఎద్దేవా చేశారు. కుటుంబరావు షేర్‌మార్కెట్ నిపుణుడని…ఆయనను తీసుకొచ్చి ప్రణాళికా సంఘంలో నియమించారని అన్నారు. ఇప్పటికైన తెదేపా ప్రభుత్వం కేంద్రంపై ఆరోపణలు మాని రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని జీవిఎల్ సూచించారు.