ఏప్రిల్‌ 19న గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి) :  ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 19న జరగనుంది. జిల్లాల్లోని బాలబాలికలకు 2015-16 సంవత్సరానికి గాను ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశ పరీక్ష 4వ తరగతి స్టేట్‌ సిలబస్‌ ఆధారంగా తెలుగు, ఇంగ్లీషు ఉర్దూ విూడియంలో ఉంటుంది. పరీక్షలో కనబరిచన ప్రతిభ ఆధారంగా బాలబాలికలు జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ఉచితంగా సీటు పొందవచ్చు. పదో తరగతి వరకు చదువుకోవచ్చు. బోరబండ సైట్‌-3లోని ఎన్‌.ఆర్‌.ఆర్‌.పురంలోని బాలుర పాఠశాల(ఇంగ్లీష్‌ విూడియం), ఇక్కడే ఉన్న బాలికల పాఠశాల(ఇంగ్లీష్‌విూడియం), ఫలక్‌నుమాలోని మైనారిటీ బాలుర పాఠశాల(ఇంగ్లీష్‌ విూడియం), నల్గొండ జిల్లాలోని సర్వేల్‌ బాలుర పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులైన ఓసీ, బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 16వ తేదీ వరకు వెబ్‌సైట్‌ ద్వారా  పొందవచ్చు.  దగ్గరలోని విూసేవ, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల నుంచి కూడ పొందవచ్చని హైదరాబాద్‌ జిల్లా ప్రభుత్వ గురుకుల పాఠశాల(బోరబండ) ప్రిన్స్‌పల్‌ ఎం.దత్తాత్రేయ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.