ఏరియర్స్ ను ఆగస్టు జీతాలతో ఇవ్వాలి
* లాభాలలో 35 శాతం బోనసు ఇవ్వాలి
* జి ఎల్ బి కే ఎస్ ను మైన్స్,సేఫ్టీ కమిటీలలో తీసుకోవాలి
* భూగర్భగనులుతో ఇల్లందు ఏరియాను కాపాడాలి
* కార్మికుల సమస్యలపై 16-25 వరకు ఆందోళన
* జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జే.సీతారామయ్య
టేకులపల్లి, ఆగస్టు 19( జనం సాక్షి ): సింగరేణి సంస్థలో కార్మికులు అనేక రకాలైన సమస్యలతో ఇబ్బందులుపడుతున్నారని,సింగరేణిలో కార్మికసంఘాలగుర్తింపు కాలం పూర్తయినందున అధికారులు ఇష్టారాజ్యంగా తమకునచ్చిన పద్ధతుల్లోవ్యవహరిస్తున్నారని,కార్మిక చట్టాలను గౌరవించి అన్ని కార్మిక సంఘాలతో సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం(ఐఎఫ్ టియు) సెంట్రల్ ప్రధానకార్యదర్శిజే.సీతారామయ్య డిమాండ్ చేశారు. ఎన్నికలు జరగకుండా ఉద్దేశ పూర్వకంగా యాజమాన్యం అడ్డుకున్నందున అన్ని రిజిస్టర్డు కార్మిక సంఘాలను గుర్తించి సమస్యల పరిష్కారం చర్చలలో కంపెనీ స్థాయికార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ సింగరేణి యాజమాన్యం రెండు మూడు సంఘాలతో ప్రాతినిధ్యం కల్పించడం అత్యంత దుర్మార్గమైందని ఆయన అన్నారు.
ఇల్లెందు ఏరియా కోయగూడెం ఓసీపీ లో బయ్యా వరప్రసాద్ అధ్యక్షతన గేట్ మీటింగు సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో 11వ వేతనఒప్పందానికి సంబంధించిన ఏరియర్స్ ఆగస్టునెల జీతాలతో ఒకే దఫా చెల్లించాలని,2023 ఆర్థిక సంవత్సరానికి సింగరేణికి రూ.700కోట్లు లాభాలు వచ్చినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని,ఈ లాభాల నుండి 35 శాతం బోనసు ఇవ్వాలని,బదిలీ వర్కర్లు 190/240 మస్టర్లు పూర్తిచేసిన వారందరినీ పర్మినెంట్ చేయాలని,సర్ఫేస్ అండర్ గ్రౌండ్ లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని,సింగరేణి అన్ని కేటగిరీలలో నెలకొన్న