ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌కి బయలు దేరిన భారత్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 18: డిఫెండింగ్‌ ఛాంపి యన్‌ భారత హాకీ జట్టు ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇవాళ దోహా బయలుదేరింది. ఇటీవల ఆస్టేల్రియాలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన నేపథ్యంలో అందరి చూపు టీమిండియాపైనే ఉంది. ఛాంపియన్స్‌ లీగ్‌లో ఆడిన జట్టుతోనే ఈ టోర్నీలో ఆడనుంది. భారత్‌తో పాటు చైనా, జపాన్‌, మలేషియా, ఒమన్‌, పాకిస్థాన్‌ జట్లు దీనిలో పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్‌లో భారత జట్టు జపాన్‌తో తలపడ నుండగా… డిసెంబర్‌ 24న చిరకాల ప్రత్యర్థి పాకి స్థాన్‌ను ఢీకొంటుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో కాం స్యం కోసం జరిగిన పోరులో భారత్‌, పాక్‌ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆసియా దేశాలు మాత్రమే పాల్గొనే ఈ టోర్నీ డిసెంబర్‌ 20 నుండి 27 వరకూ జరుగుతుంది. అటు పాకి స్థాన్‌ జట్టు కూడా లా¬ర్‌ నుండి బయలుదేరి వెళ్లింది.

భారత జట్టు ః

గోల్‌ కీపర్లు – పిఆర్‌ శ్రీజేష్‌, పిటి రావు

ఫుల్‌బ్యాక్స్‌ – విఆర్‌ రఘునాథ్‌ (వైస్‌ కెప్టెన్‌), రూపిందర్‌పాల్‌సింగ్‌, హర్బీర్‌సింగ్‌

హాఫ్‌ బ్యాక్స్‌ – సర్ధార్‌సింగ్‌ (కెప్టెన్‌) , కొతజిత్‌సింగ్‌, భీరేంద్ర లక్రా, మన్‌ప్రీత్‌సింగ్‌, గుర్మిల్‌సింగ్‌

ఫార్వార్డ్స్‌   – ఎస్‌వి సునీల్‌, గుర్విందర్‌సింగ్‌ చాంది, డానిష్‌ ముజ్తాబా, ఎస్‌కె ఊతప, నితిన్‌ తిమ్మయ్య, యువరాజ్‌ వాల్మీకి, ధర్మవీర్‌సింగ్‌, అక్షదీప్‌సింగ్‌

భారత జట్టు షెడ్యూల్‌ ః

డిసెంబర్‌ 20  – భారత్‌ ఒ చైనా

డిసెంబర్‌ 21  – భారత్‌ ఒ జపాన్‌

డిసెంబర్‌ 23  – భారత్‌ ఒ ఒమన్‌

డిసెంబర్‌ 24  – భారత్‌ ఒ పాకిస్థాన్‌

డిసెంబర్‌ 26  – భారత్‌ ఒ మలేషియా