ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌

ఆదిలాబాద్‌ : లంచం తీసుకుంటూ గుడిహత్నూర్‌ తహసీల్దార్‌ రాజేశ్వర్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. పట్టాదారు పాన్‌ పుస్తకాల కోసం రైతుల నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ తన నివాసంలో లంచం తీసుకుంటండగా ముందస్తు సమాచారంతో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.