ఏసీబీ సోదాల్లో నగదు, పత్రాలు లభ్యం
హైదరాబాద్: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ ముడుపుల కేసులో మధ్యవర్తిత్వం వహించిన రౌడీషీటర్ యాదగిరిరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి విలువైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి మూడు గంటలపాటు నాచారంలోని అతని నివాసంలో జరిపిన సోదాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాలిజనార్దన్‌రెడ్డి అనుచరల నుంచి రహస్యంగా పొందిన 2.25 కోట్ల నగదును యాదగిరి అతని ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో దాచాడు. దీన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు ట్యాంక్ నుంచి నగదును బయటకు తీయించారు. వీటితోపాటు ఈ ఇంటికి సమీసంలోని నిర్మాణంలో ఉన్న మరో ఇంట్లో రహస్యంగా దాచిన రెండు బస్తాల విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.