ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే: రణ్‌బీర్ కపూర్
ముంబయి: కథ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమేనని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ స్పష్టంచేశారు. కరణ్ జోహార్ చిత్రంలో రెండో ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించేందుకు రణ్‌బీర్ సందేహిస్తున్నారని వస్తున వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమాలో ప్రధాన పాత్ర, ద్వితీయ పాత్రలపై తనకు నమ్మకం లేదన్నారు. ప్రాధాన్యతతో సంబంధం లేకుండా మంచి పాత్ర ఏదైనా చేయడానికి సిద్దమని చెప్పారు. ముంబయిలో జరిగిన బర్ఫీ డీవీడీ ఆవిష్కరణ క్యాక్రమంలో రణ్‌బీర్ పై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రణ్‌బీర్ ‘ యే జవానీ హై దివానీ ‘ చిత్రం షూటింగ్‌లో బీజీగా ఉన్నారు.