ఐఎస్‌ను తుదముట్టిస్తాం

1
– రష్యా కలిసి రావాలి

– ఆసియా శిఖరాగ్రసభలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా

కౌలాలంపూర్‌: ఇస్లామిక్‌ స్టేట్‌ ను తుదముట్టిస్తామని, ఉగ్రవాద అంశాన్ని తాము తీవ్రంగా తీసుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా   స్పష్టం చేశారు. ఆదివారం కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియాన్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మరో అగ్ర రాజ్యం రష్యాను ఉద్దేశించి కూడా

మాట్లాడారు. ఇటీవల రష్యా కూడా సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగిందని, అయితే, అవి నేరుగా ఇస్లామిక్‌ స్టేట్‌ అంతమొందించే లక్ష్యంతో దాడులు

చేసినట్లుగా కాకుండా కేవలం తన ప్రత్యర్థిపై దాడులు చేసినట్లుగా ఉందన్నారు.కానీ, అమెరికా మాత్రం ఉగ్రవాదాన్ని ఊడ్చిపారేసే చర్యలు తీసుకుంటుందని, ప్రపంచశాంతి ముఖ్యం అని అన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ను ఎదుర్కోవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని.. ఆ దిశగా ముందుకు వెళతామని చెప్పారు. యుద్ధరంగంలో ఇస్లామిక్‌ స్టేట్‌ తమను

ఎదుర్కోలేదని, ఆ భయంతోనే తమకు ఉగ్రవాద రంగు పులిమే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ‘మేం ఇస్లామిక్‌ స్టేట్‌ ను ధ్వంసం చేస్తాం. అందుకోసం దానికి ఎక్కడి నుంచి నిధులు అందకుండా అడ్డుకట్ట వేస్తాం. మాకు ప్రపంచ ప్రజల ప్రాణాలు ముఖ్యం. మతపరంగా మాకు ఎలాంటి వివక్ష లేదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.రష్యా  తమతో కలిసిరావాలని ఆయన కోరారు.