ఐఐటి జేఈఈ మెయిన్స్ లో అల్ఫోర్స్ కు ర్యాంకుల పంట

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
ఐఐటి జేఈఈ మెయిన్స్ 2022 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు పలు కేటగిరీల లో అత్యుత్తమ ఫలితాలు సాధించి జాతీయ స్థాయిలో ర్యాంకుల పంట పండించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అభినందించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ డి.సదాశివరెడ్డి జాతీయస్థాయి 242 ర్యాంకు, భూక్యా మణికంట 375, ఆర్.రిష్మిత 487, డి . విశ్వనాథెడ్డి 577 , వి.రామ్ ప్రణీత్ 597 , యమ్ సాత్విక్ 607 , సి.హెచ్ నిషాంత్రెడ్డి 673, పి.సాయికాశిక్ 730, పి.సాయిశరణ్ 845 ర్యాంకు, పి సిద్దార్థ్ 1019, బి నవధీప్ 1382, టీ వెంకటచరణారావు 1655, కె ఆర్య 1656, రూపాసింగ్ 2005, కె.వి.వి.ఎస్.ఎస్.రేష్మిత 2080, సి.హెచ్ . రాజవిఘ్నేష్ 2088, సి.హెచ్ సుప్రీమ్ 2090 , ఏ భార్గర్రెడ్డి 2091 , డి ఆపూర్వ 2240 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. 28 మంది విద్యార్థులు 5,000 లోపు ర్యాంకులు, 401 మంది అల్ఫోర్స్ విద్యార్థులు ఐ.ఐ.టి ఆడ్వాన్స్డ్ పరీక్ష వ్రాయుటకు అర్హత సాధించండం సంతోషంగా ఉందన్నారు . పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన , విద్యార్థుల అహర్నిషల కృషి, అల్ఫోర్స్ నిరంతర పర్యవేక్షణ తో ఇంతటి ఘన విజయం సాధించగలిగామని వెల్లడించారు . రాబోయే నీట్, ఎంసెట్ ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు . అద్భుత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ ఆణిముత్యాలను వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇంతటి విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.