ఐఓఏ ఎన్నికలు వాయిదా!

ఢిల్లీ: ఆదినుంచి వివాదాస్పదంగా మారిన భారత్‌ ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఎన్నికల అంశం మరో మలుపు తిరిగింది, ఐఓఏ ఎన్నికల పరిశీలన కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన ఎలక్షన్‌ కమిషన్‌ మాజీ చీఫ్‌ ఎస్‌,వై ఖురేషీ శనివారం రాజీనామా చేశారు. ప్రభుత్వ క్రీడా నియమావళిని అనుసరించి ఎన్నికలు నిర్వహించడం కుదరదని ఐఓఏ చెప్పడంతో తాను కమిటీ చైర్మన్‌ పదవిలో కొనసాగలేనని ఖురేషీ తన రాజీనామా లేఖలో తెలియజేశారు. దీంతో ఈ నెల 25న జరగాల్సిన ఐఓఏ ఎన్నికలు వాయిదా పడే అవకాశముంది. ఎన్నికలు ప్రభుత్వ క్రీడా నియామావళి ప్రకారం కాకుండా ఒలింపిక్‌ చాప్టర్‌ , ఐఓఏ నియమావళి అనుసరించి మాత్రమే జరగాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమీటి (ఐఓసీ) శుక్రవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఐఓఏ ఎన్నికలె పారదర్శకంగా జరిగేందుకుగాను ఖురేషీ ఛైర్మన్‌గా రిటైర్డ్‌ చీఫ్‌ తప్పుకోవడంతో కమిటీకి కొతంత చైర్మన్‌ వచ్చేదాకా తాము ఎన్నికల స్క్రూటిని నిర్వహించలేమని ఐఓఏ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వి.కె బాల స్పష్టం చేశారు. దీంతో ఎన్నికలు వాయిదా పడే సూచనలే ఎక్కువగా ఉన్నాయి.