ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి : తెరాస
హైదరాబాద్ : ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అర్హులైన సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించడంతోపాటు ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలను సభలో లేవనెత్తుతామని తెలిపారు. నల్గొండ జిల్లా తెరాస నేత సాంబశివుడు హత్య కేసులో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈటెల అరోపించారు. ఆయన తమ్ముడిపైనా హత్యాయత్నం జరిగినందున ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.