ఐక్యంగా ఉంటేనే పార్టీకి మనుగడ..మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి: పార్టీని అన్ని విధాల బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ఐక్యంగా ఉంటేనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, 2014ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి అని మంత్రి శ్రీధర్‌బాబు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలను కోరారు. సోమవారం పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి యువజన కాంగ్రెస్‌ సమావేశంంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను యువజన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాఉ పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలం బొంపల్లి తాగునీటి పథకానికి అదనపు నిధులను మంజూరు చేస్తామన్నారు. ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ పార్టీలో నిబద్దతలో పనిచేసినపుడే గుర్తింపు లభిస్తుందన్నారు. ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు మాట్లాడుతూ పార్టీలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు పట్టుదలతో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వరప్రసాద్‌, నాయకులు బిరుదు రాజమల్లు, రవీందర్‌రావు, ధర్మయ&్య, రఘువీర్‌సింగ్‌, కొమురయ్య తదితరులున్నారు.