ఐక్యరాజసమితి పరిశీలనలో కాశ్మీర్
న్యూఢిల్లీ,ఆగస్టు 2(జనంసాక్షి): సున్నితమైన కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి పరిశీలిస్తోందని యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ కార్యాలయం తెలిపింది. భారత్ పాక్ దేశాలు ఈ సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రతి అంశంపై ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐక్యరాజ్య సమితి తమ పర్యవేక్షక బృందాల ద్వారా వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తుంటుందని బాన్‌కీమూన్ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్ పరిస్థితిపై ఓ పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. బాన్‌కీ మూన్ కశ్మీర్ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నారని.. ఇటీవల జరిగిన అల్లర్లలో పలువురి ప్రాణాలు పోవటం ఆయన దృష్టికి వచ్చిందని చెప్పారు.