ఐజ ను రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పటు చేయాలి

మహబూబ్ నగర్ (జనం సాక్షి )

జోగులాంబ గద్వాల జిల్లాలోనే కాదు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అతిపెద్ద గ్రామపంచాయతీగా ఉండి నేడు గ్రేడ్ 2 మున్సిపాలిటీగా దినదిన అభివృద్ధి చెందుతున్న ఐజ ను రెవిన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని ప్రజలు కోరుతున్నా సంగతి తెలిసిందే,50వేలకు పైగా జనాభాను కలిగి, ప్రతి సంవత్సరం ఊహించని విధంగా విస్తరిస్తూ వస్తున్నది, భూ కొనుగోలు విషయమైతేనేమి ఇతర లావాదేవిలా పరంగా చూసిన గద్వాలకు కుడి, ఎడమంగా , ఉంటుందనేది నగ్నసత్యం సుమారు 60 గ్రామాలకు ఐజ మండలం అనుసంధానమై వ్యాపారంలో నిత్యం కొనసాగుతున్నది.

👉- ఐజ అతి పెద్ద మండలం సుమారు 30 గ్రామాలు కలిగి వుంది ఐజ మండల గ్రామాలతో పాటు గట్టు, మల్దకల్, ఇటిక్యాల, వడ్డేపలి, రాజోలి ,మండలాల గ్రామా ప్రజలు కుడా నిత్యం ఐజకు వచ్చి వారి వారి పనులను అవసరాలను వ్యాపారాలను కొనసాగిస్తూ వుంటారు ఇటు రాయచుర్, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కర్నూల్, గద్వాల మధ్య కేంద్రంగా విరాజీలుతున్న ఐజ పట్టణం కావాల్సినంత అభివృద్ధి కి నోచుకోలేక పోయిందన్న వాస్తావని ఒపుకోవాల్సిందే

👉 మంచికి మారుపేరుగా ప్రశాంతతకు నిలయంగా వ్యాపారం వ్యవసాయం తప్ప మరే ఇతర అరాచకాలకు రాజకీయ గొడవలకు దూరంగా వుంటూ తన పని తాను చేసుకుపోతున్న నైజమే ఐజ ది

👉 ఎపుడో గత Dలీమిటేషన్ లోనే ఐజ నియోజకవర్గం గా మారుతుందనే విషయం వెలుగులోకి వచ్చినా ఎందుకో కాలేక పోయింది.

👉 జోగులాంబ గద్వాల జిల్లాలో మరో డివిజన్ కేంద్రంగా మారిస్తే ఐజ తో పాటు మూడు నాల్గు మండలాల కు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాము.

👉 ఐజ రెవిన్యూ డివిజన్ అయితే వచ్చే సౌకర్యాలు, లాభాలు, అన్ని ఇన్ని కావు ఐజ అభివృద్ధి మరింత వేగవంతం ఆవుతుంది పరిపాలన సౌలభ్యం చేకూరుతుంది రాబోయే కాలంలో నియోజకవర్గ కేంద్రంగా మరే అవకాశం వుంది వ్యాపారం పదివంతులు అవుతుంది, అన్ని మండలాల ప్రజలకు RDO, DSP, CI, లాంటి ఇతర అన్నీ ప్రభుత్వ ఆఫీసులు వస్తాయి sub-కోర్టు కూడా వచ్చే అవకాశం వుంది మరియు ఎగ్జిక్యూటివ్ కరెంటు అధికారులు మరియు ఇతర ప్రభుత్వ శాఖలు కూడా డివిజన్ కేంద్రంగా వస్తాయ్ ఇన్ని ఫలితాలు వున్న ఐజ ను రెవిన్యూ డివిజన్ కేంద్రంగా మార్చమని ప్రభుత్వాన్ని అడుగుదామా ? వద్దా ?

మేధావులైన , చైతన్య వంతులైన, ఐజ ప్రజలు ఆలోచించాలి గతంలో మనం ఐజకు ఎన్నో పోరాడి సాధించుకునం,రాజకీయాలకు అతీతంగా అభివృద్దే ధ్యేయంగా కలిసిమెలిసి పోరాడేతత్వం ఉన్న ఐజ ప్రజలు విద్యావంతులు,మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ వర్గాలు వ్యాపారస్థులు ఈ పోరాటం లొ కలసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

ఐజను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసేవరకు అలుపెరగక చేయి చేయి కలిపి సాగుదాం.